Mallapur | మల్లాపూర్, జూన్ 27 : ప్రత్యేక ప్రణాళికలతో గ్రామాల అభివృద్ధికి తన వంతుగా ఎల్లావేలాల కృషి చేస్తానని రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు అన్నారు. మల్లాపూర్ మండలంలోని గొర్రెపల్లి, మల్లాపూర్, సిరిపూర్ గ్రామాల్లో పలు పథకాల కింద మంజూరైన రూ.67 లక్షల విలువ గల నిధుల మంజూరు పత్రాలను ఆయన గ్రామాల ప్రజాప్రతినిధులకు అందిచడంతో పాటు, చేపట్టిన పనులను శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకతీతంగా అభివృద్ధి విషయంతో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటానని, గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీకాంత్, మాజీ జడ్పీటీసీ ఎలాల జలపతిరెడ్డి, సర్పంచులు ఏలేటి వెంకట్ రెడ్డి, చిట్యాల లక్ష్మణ్, పెంట సౌజన్య, మార్కెట్ చైర్ పర్సన్ అంతడ్పుల పుష్పలత, మాట్ల సోమయ్య తదితరులు పాల్గొన్నారు.