సుల్తానాబాద్ రూరల్, మార్చి 5 : పెద్దపల్లి జిల్లాలో మధ్యాహ్న భోజనం అమలవుతున్న తీరును, మధ్యాహ్న భోజన వర్కర్స్ కు బిల్లుల చెల్లింపులు చేస్తున్న విధానమును పరిశీలించుటకు బుధవారం రాష్ట్ర అధికారి శశి కుమార్ సుల్తానాబాద్ మండలంలోని పలు పాఠశాలలను సందర్శించడం జరిగింది. ఎండీఎం బిల్లుల చెల్లింపులలో జాప్యం లేకుండా సకాలంలో ఆన్లైన్ విధానం ద్వారా చెల్లించుటకు గాను నూతనంగా అమలు చేయుటకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయుటకు సుల్తానాబాద్ మండలంలో ఈ రోజు మధ్యాహ్నం ప్రాథమిక పాఠశాల (బాలికలు), జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు) పాఠశాలలను శశి కుమార్ సందర్శించడం జరిగింది.
మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్న తీరును అడిగి తెలుసుకోవడం జరిగింది. మధ్యాహ్న భోజన వర్కర్లకు వీలైనంత తక్కువ కాలంలో వారి యొక్క జీతాల చెల్లింపు బిల్లులను ఆన్లైన్ ద్వారా చెల్లించుటకు ఉన్న అవకాశాలను గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మండల విద్యాధికారి ఆరెపల్లి రాజయ్యను, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఎండీఎంకు సంబంధించి విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల ఎండీఎం రిజిష్టర్లు, రికార్డ్లు పరిశీలించారు. వీరి వెంట ఎంఆర్సీ కార్యాలయ ఉద్యోగులు సీసీవో రజియ, రమేష్, డీఈవో కార్యాలయ ఉద్యోగి రాజు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శారదా, అనిల్ కుమార్, పాఠశాలల ఎండీఎం ఇంచార్జి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.