Gangadhara | గంగాధర, మే 11: ఉత్తమ విద్యతోనే విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోగలరని తహసీల్దార్ రజిత, ఎంపీడీవో రాము, ఎంఈఓ ప్రభాకర్ రావు, ఎస్సై వంశీకృష్ణ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో మొదటి రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఈనెల 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు
విద్యా వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గంగాధర ప్రభుత్వ పాఠశాలలో భవిత యాక్టివిటీ రూమ్, మోడల్ స్కూల్ లో సమ్మర్ క్యాంప్, గర్షకుర్తి పాఠశాలలో కిచెన్ షెడ్‌ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ విద్యార్థులు సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని, కళలు, క్రాఫ్ట్స్, సంగీతం, క్రీడలు, రచనా నైపుణ్యాలు, సృజనాత్మక అంశాలను నేర్చుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.సర్పంచ్‌లు పడాల భాగ్యలక్ష్మి, రేండ్ల శ్రీనివాస్, చింతం ఆంజనేయులు, ప్రిన్సిపాల్, పద్మ తదితరులు పాల్గొన్నారు.