IAS school | కోల్ సిటీ, జనవరి 10 : రంగవల్లులు మహిళలు, విద్యార్థినుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తాయని ఐఏఎస్ పాఠశాల డైరెక్టర్ పేరం హేమలత అన్నారు. గోదావరిఖని ఎల్బీనగర్ లో గల ఇండో అమెరికన్ పాఠశాలలో శనివారం నిర్వహించిన ముందస్తు సంక్రాంతి వేడుకలు అలరించాయి. చిన్నారులు సంప్రదాయ వస్త్రధారణలతో ఆకట్టుకున్నారు. పాఠశాల ఆవరణలో అందమైన రంగవల్లులను తీర్చిదిద్దారు.
గాలిపటాలను ఎగరవేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ హేమలత ముఖ్యఅతిథిగా హాజరై రంగవల్లులను పరిశీలించి ప్రకృతి పరిరక్షణ, సంక్రాంతి పండుగ సంప్రదాయం ఉట్టిపడేలా అందంగా ముగ్గులు వేసిన విద్యార్థినులను అభినందించారు. ఈ పోటీలలో విద్యార్థినుల తల్లులు ఆసక్తిగా పాల్గొని ఉత్సాహంగా ముగ్గులు అలంకరించారు.
విద్యార్థులకు చదువుతోపాటు పండుగల ప్రాశాస్త్రం కూడా తెలిసే విధంగా ఈ ఫోటోలు నిర్వహించడం జరిగిందని పాఠశాల డైరెక్టర్ పేరం హేమలత అన్నారు. అనంతరం ఉత్తమ బహుమతులకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సునీత, స్వప్న, లావణ్య, దీప్తి, శివ, సంపత్ అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.