Chigurumamidi | చిగురుమామిడి, మే 4: తెలంగాణ ప్రభుత్వం ఆరేళ్ల క్రితం హరితహారంలో భాగంగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాల నిర్వహణ ప్రస్తుతం లోప భూయిష్టంగా మారింది. అధికారుల పర్యవేక్షణ కరువు, సిబ్బందిలో అలసత్వం ఏర్పడింది. మండలంలోని 17 గ్రామాలకు అన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ చెట్లకు పాదులు తీయడం, నీరు పట్టడం, మొక్కల సంరక్షణ, మొదటి 2 సంవత్సరాల మైంటెనెన్సు కూడ కాల పరిమితి ముగిసింది. దీంతో 2020 లో ప్రారంభమై పల్లె ప్రకృతి వనాల పర్యవేక్షణ ఐదు సంవత్సరాలు బాగున్నప్పటికీ, ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణ ఉండడంతో పంచాయతీ కార్యాలయంలో నిధుల కొరతతో వాటిని సంరక్షించేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
గ్రామపంచాయతీ ట్రాక్టర్ల ద్వారా నీటి టాంకర్ లను ఏర్పాటు చేసుకొని మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులు పై ఉంది. కానీ చాలా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు నిధుల కొరత కారణంగా.. నిర్వహణ ఇబ్బంది కరంగా ఉండడంతో పల్లె ప్రకృతి వనాలపై దృష్టి సారించడం లేదు. చాలా గ్రామాల్లో సరైన ప్రభుత్వ భూమి అందుబాటులో లేక ఉన్న ప్రభుత్వ భూమిలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు.
ఏవరిదీ.. నిర్లక్షం.?
పల్లె ప్రకృతి వనాలతో పాటు గ్రామపంచాయతీ పర్యవేక్షణ బాధ్యత మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) బాధ్యత ఉంటుంది. పంచాయతీ కార్యదర్శులతో తరచూ సమన్వయాన్ని పెంపొందిస్తూ, గ్రామాల్లో ఉన్న పారిశుధ్య సమస్యలు లేకుండా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం సంబంధిత అధికారి ఒక గ్రామానికి గ్రామ ప్రత్యేకాధికారిగా ఉండడంతో ఆ గ్రామాన్ని ఎక్కువ సమయానికి కేటాయించడంతో మిగతా గ్రామాలపై దృష్టిని సారించ లేకపోతున్నాడని విమర్శలు వినబడుతున్నాయి. పంచాయతీ కార్యదర్శులతో సమన్వయాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యత ఎంపీఓ పై ఉంటుంది.
కానీ మండలంలో పరిస్థితుల భిన్నంగా ఉంది. మండల అధికారికి పంచాయతీ కార్యదర్శులకు సమన్వయం లేకపోవడం ఇబ్బందికరంగా ఉంది. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ ఇతర అభివృద్ధిలో జాప్యం జరుగుతుందని విమర్శలు వినపడుతున్నాయి. పంచాయతీ కార్యదర్శులకు మండల అధికారులకు మధ్య పూర్తిస్థాయి సమన్వయం లేకపోవడం వల్ల గ్రామ పంచాయతి పాలన వ్యవస్థ కొంటుపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అధికారుల నిరంతర పర్యవేక్షణ సరిగా లేదని పూర్తిగా గాడి తప్పిందని మండలంలో ఆరోపణలు వినబడుతున్నాయి.
పల్లె ప్రకృతి వనాలలో 28 వేల మొక్కలు
మండలంలోని 17 పల్లె ప్రకృతి వనాలలో సుమారు 28 వేల మొక్కలు వనాలలో ఉన్నాయి. ప్రతీనెల వాటికి నిర్వహణ ఖర్చు పంచాయతీ కార్యదర్శులు చూడాల్సిన ఉంటుంది. కానీ నిధుల లేమితో పర్యవేక్షణ కొరబడింది. దీంతో అధికారులు సైతం తూతూ మంత్రంగా పల్లె ప్రకృతి వనాలపై దృష్టి సారిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం లో భాగంగా పల్లె ప్రకృతి వనాలపై సంబంధిత అధికారులు దృష్టి సారించారు. పర్యావరణ పరిరక్షణకు దోహద పడాల్సిన అవసరం ఉందని పలు గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వారానికి ఒక రోజు టాంకర్లతో నీరు.. : రాజశేఖర్ రెడ్డి, ఎంపీఓ
మండలంలోని పల్లె ప్రకృతి వనాలకు ప్రతి శుక్రవారం రోజున గ్రామపంచాయతీ ట్యాంకర్ల ద్వారా మొక్కలకు నీటిని చూస్తున్నాం. ఇటీవల ఎండ తీవ్రతకు చాలా మొక్కలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. వాటిని కాపాడేందుకు వారానికి రెండుసార్లు ట్యాంకర్ల ద్వారా నీటిని ప్రకృతి వనాలకు అందించాలని భావిస్తున్నాం.