Prajavani | కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 16 : పక్క ఫోటోలో కనిపిస్తున్న మహిళలు జమ్మికుంట పట్టణంలోని పలు కాలనీలకు చెందిన వారు. వీరి పేర్లు వరుసగా ఇనుగాల రాణి భర్త రవి, ఎరబాటి సుజాత భర్త సుధాకర్, కాసర్ల శారద భర్త శ్రీనివాస్, బిజిగిరి లక్ష్మి భర్త శంకర్. కుటుంబ పెద్దలైన వారి భర్తలు వివిధ అనారోగ్య కారణాలతో రెండేళ్ళక్రితం మరణించారు. దిక్కులేని కుటుంబాలకు తమ ప్రభుత్వం ఇచ్చే ”చేయూత”ను అందుకోవాలంటూ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సహా పలువురు మంత్రులు, కాంగ్రెస్ నాయకులు పదేపదే చెబుతుండటంతో, వచ్చే పెన్షన్ తమకుటుంబానికి ఆసరాగా మారుతుందనే ఆశతో ప్రజాపాలనలోనే ధరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటివరకు వాటికి మోక్షం లభించలేదు. వీరి తర్వాత చేసుకున్న ధరఖాస్తు దారులకు మాత్రం మంజూరైంది.
ఆరేడు నెలల నుంచి వారి ఖాతాల్లో పెన్షన్ డబ్బులు జమ అవుతున్నాయి. దీంతో, మున్సిపల్ అధికారుల వద్దకెళ్ళి అడిగితే సైట్ క్లోజ్ అయింది. ఇంకా తెరవలేదంటూ దాట వేస్తుండటంతో, మాతర్వాత ధరఖాస్తులు చేసుకున్నవారికెలా పెన్షన్ మంజూరైంది అని ప్రశ్నిస్తే, కరీంనగర్ లో అడుగుండ్లి వాళ్ళుచెబుతారంటూ నిర్లక్ష్యపు సమాధానమివ్వటంతో, సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణికి రావటంతో ఇక్కడ కూడా సరైన సమాధానం లభించలేదని వాపోతున్నారు. మీ సేవలో ధరఖాస్తు చేసి మున్సిపల్ కమీషనర్‌కు ఇవ్వాలంటూ అధికారులు సూచించారని, అసలు మాకు పెన్షన్ మంజూరు చేస్తారా? చేయరా? మేమేం తప్పు చేశాం? భర్తలు చనిపోయిన మమ్ములను ఎందుకిట్ల ఇబ్బందుల పాలు చేస్తున్నరంటూ ప్రజావాణికి హాజరైన అధికారుల ఎదుట మోకరిల్లారు. ఒక్క జమ్మికుంట పట్టణానికి చెందిన ఈ నలుగురే కాదు జిల్లాలో పరి సోనువారం ప్రజావాణికి వచ్చి సెనన్లు మంజూరు చేయాలంటూ
జమ్మికుంట పట్టణానికి చెందిన ఈ నలుగురే కాదు.. జిల్లాలో ప్రతి సోమవారం ప్రజావాణికి వచ్చి పెన్షన్లు మంజూరు చేయాలంటూ వేడుకుంటున్న వారి సంఖ్య రెండంకెలు దాటిపోతున్నట్లు తెలుస్తున్నది. వారం వారం క్రమం తప్పకుండా వస్తూ, ధరఖాస్తులందజేస్తున్నా తమకు ఇప్పటికీ పెన్షన్ మంజూరు కావటం లేదని వాపోతున్నారు అయినా, నేడు కాకపోతే రేపైనా తమకు న్యాయం లభిస్తుందనే ఆశతో బాధితులు ప్రజావాణికి తరలివస్తూనే ఉన్నారు. తమకు జరుగుతున్న అన్యాయంపై అధికారులకు వినతిపత్రాలు అందజేస్తూనే ఉన్నారు. కాగా, సోమవారం నాటి ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 307 మంది ఆర్జీదారుల నుంచి అదనపు కలెక్టర్ లక్ష్మికిరన్, మున్సిపల్ కమీషనర్ : ప్రపుల్ దేశాయ్, డిఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ ధరఖాస్తులు స్వీకరించి, ఆయా శాఖల అధికారులు అందజేశారు.
విద్యా సంస్థల ఫీ‘జులుం’పై ఉక్కుపాదం మోపాలి : దుస్స లక్ష్మన్, జాతీయ మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు, కరీంనగర్
విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రదర్శిస్తున్న ఫీజులుంతో పేద, మద్య తరగతి కుటుంబాలు తమ పిల్లలను చదివించలేని దుస్ధితికి చేరుతున్నాయి. విద్యాహక్కు చట్టం నిబంధనలు ఉల్లంఘిస్తూ, ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. 25 శాతం మందికి ఉచిత విద్య అందించాలనే ఆదేశాలు గాలిలో కలిసిపోయాయి. తరగతి గదుల్లో కనీస సౌకర్యాలు కూడా ఉండటం లేదు. ప్రైవేటు విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య దేవుడెరుగు, కనీసం చిన్నారులకు అర్ధమయ్యేరీతిలోనైనా బోధించటం లేదు. దీంతో, వారి మెదళ్ళలో బట్టీ విధానమే ఇప్పటికీ కొనసాగుతున్నది. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు పెంచే విద్యాసంస్థలపై ఉక్కుపాదం మోపాలి ప్రభుత్వం అందించే నాణ్యమైన విద్యపై ప్రచారం కొరవడింది వేతనాలున్నట్లుగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫలితాలు వచ్చేటట్లు చర్యలు తీసుకోవాల్సిన అవసరమున్నది. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ విద్యను అభివృద్ధి చేసేందుకు ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి టార్గెట్ నిర్ణయిస్తే, ప్రభుత్వ విద్యాసంస్థల్లో అత్యున్నత ఫలితాలు వస్తాయి.
వాటికి పూర్వపు కల వస్తుంది. నిరుపేద, దిగువ మధ్య తరగతి కుటుంబాల పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఫీజులు పెంచేలా చర్యలు తీసుకోవాలంటూ ట్రస్మా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావుకు వినతిపత్రం అందజేశాము. సీలింగ్ భూమిని లాక్కుంటున్నరు : ఇరుగురాల దేవెందర్, ఇరుగురాల లక్ష్మయ్య, తాహెర్ కొండాపూర్, కరీంనగర్ రూరల్ మండలం మాగ్రామంలో 33 ఏళ్ళ క్రితం పంపిణీ చేసిన సీలింగ్ భూమిని తిరిగి లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నరు. గ్రామంలోని కూర మాధవరెడ్డికి చెందిన 20 ఎకరాల భూమిని సీలింగ్ భూమిగా ప్రకటించి, 1993, నవంబర్ 25న గ్రామసభ ఏర్పాటు చేసి పేదలకు పంచారు. ప్రొసీడింగులు కూడా అందజేసిండ్లు. ఆయితే, ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం లబ్దిదారుల పేర్లు ఎక్కలేదు. ఇప్పటికీ వారి పేర్లే కొనసాగుతున్నాయి. దీంతో, రెండేళ్ళ కిందట వారి వారసులు తమ పేర్లపైకి మార్చుకున్నారు.
సాగుచేసుకుంటున్న మమ్ములను ఆభూముల్లో నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దళితులను కూడా మాపైకి ఉసిగొల్పి, గొడవలు సృష్టించేందుకు పన్నాగాలు పన్నుతున్నారు అధికారులకు ఇప్పటికీ పదిసార్లు విన్నవించుకున్నాం. అయినా, పరిష్కారం చూపలేదు మాపైనే పోలీసు కేసులు పెట్టించేందుకు వారి వారసులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజావాణిలో కూడా. నాలుగుసార్లు ఫిర్యాదులు చేశాము దయచేసి మాకు న్యాయం చేయాలి.