MLA Padi Kaushik Reddy | వీణవంక, డిసెంబర్ 14 : సర్పంచ్ ఎన్నికలల్లో ప్రజలు మోసపోయి గోసపడవద్దని, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కోరారు. మండలంలోని ఘన్ముక్ల, ఎల్బాక, రెడ్డిపల్లి, బేతిగల్ గ్రామాల్లో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పాల్గొన్ని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థులు గాజుల శకర్, మడికొండ రమ భూమయ్య, అడిగొప్పుల నిర్మల సత్యనారాయణ, గొర్రె హరిచందన తరఫున ఎన్నికల ప్రచారం చేసి వారిని ఆశీర్వదించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ వనమాల-సాధవరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచ్‌లు జున్నూతుల సునీత- మల్లారెడ్డి, కాంతారెడ్డి, పోతుల నర్సయ్య, మాజీ ఎంపీటీసీలు నాగిడి సంజీవరెడ్డి, లక్ష్మీ-భూమయ్య, సింగిల్‌విండో డైరెక్టర్లు మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ఊట్ల దేవయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లో చేరికలు
మండలంలోని ఘన్ముక్ల గ్రామంలో గాజుల రాజు, ఎలుబాకలో ఊట్ల రాజయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వారికి గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని, ఇతర పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.