CC Cameras | వీణవంక, ఏప్రిల్ 19 : వీణవంక మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామాంజనేయ దేవాలయానికి సీసీ కెమెరాలను అందజేశారు. దేశాయిపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ మంద మధుసూదన్‌రెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు మంద రాంరెడ్డి మల్లారెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామాంజనేయ దేవాలయానికి రూ.20 వేల విలువ గల 5 సీసీ కెమెరాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ముద్దసాని భిక్షపతి, అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షడు గోనెల సమ్మయ్య, మండల ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు పల్లెర్ల కిరణ్ గుప్తా, నాయకులు మేకల తిరుపతిరెడ్డి, దూలం కిరణ్, కర్రె స్వామి, కర్రె కిష్టయ్య, ముద్దసాని కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.