Independence Day | ఢిల్లీ ఎయిర్పోర్ట్, హైకోర్ట్, ఎర్రకోట సహా కీలక ప్రదేశాలకు బాంబు బెదిరింపు.. హై అలర్ట్
Independence Day : దేశం ఒకపక్క స్వాతంత్య్ర దిన వేడుకలకు సిద్దమవుతుంటే.. మరోపక్క దేశ రాజధానికి మాత్రం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీలోని ఎయిర్పోర్టు, ఎర్రకోట, హైకోర్ట్ సహా కీలక ప్రదేశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇందుకు సంబంధించి శుక్రవారం అధికారులకు ఒక ఈమెయిల్ వచ్చింది.
Independence Day : దేశం ఒకపక్క స్వాతంత్య్ర దిన వేడుకలకు సిద్దమవుతుంటే.. మరోపక్క దేశ రాజధానికి మాత్రం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీలోని ఎయిర్పోర్టు, ఎర్రకోట, హైకోర్ట్ సహా కీలక ప్రదేశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇందుకు సంబంధించి శుక్రవారం అధికారులకు ఒక ఈమెయిల్ వచ్చింది. దీనిలో ఢిల్లీలోని కోర్టులు, రైళ్లలో పేలుళ్లకు పాల్పడతామని హెచ్చరించారు. ఆగష్టు 15న ఈ పేలుళ్లు జరుపుతామని మెయిల్లో ఉంది. అందులోనూ ఢిల్లీ హైకోర్టును ఆగష్టు 15న మధ్యాహ్నం 2.11 గంటలకు పేల్చేస్తామని కూడా పేర్కొన్నారు.
ఢిల్లీని ఖలిస్తాన్లో భాగంగా చేయాలనే లక్ష్యంతో ఈ పేలుళ్లు జరుపుతామని మెయిల్లో పేర్కొన్నారు. సిక్కులకు న్యాయం చేయడంలో ఢిల్లీ హైకోర్టు విఫలమైనట్లు, అందులోనూ 1984లో జరిగిన సిక్కు అల్లర్ల కేసులో బాధిత సిక్కులకు కోర్టు న్యాయం చేయలేకపోయిందని, అందుకే ఢిల్లీ హైకోర్టును టార్గెట్ చేశామని మెయిల్లో వివరించారు. ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3ని పేల్చేస్తామన్నారు. జామ్నగర్ హౌజ్, ఝండేవాలన్ బిల్డింగ్ వంటివాటికి కూడా బాంబు ముప్పు ఉంది. ఈ బాంబు హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు, భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించారు. బాంబు బెదిరింపులు ఉన్న ప్రదేశాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గట్టి నిఘా, బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంట్రీ, ఎగ్జిట్ రూట్లలో తనిఖీలు చేపడుతున్నారు.
ఇతర పబ్లిక్ ప్లేసులలో కూడా తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ హైకోర్టు, ఎయిర్పోర్టులలో భద్రతను మరింతకట్టుదిట్టం చేశారు. శనివారం, ఆగష్టు 15న ఢిల్లీలో స్వాతంత్య్ర దిన వేడుకలు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకల కోసం ఢిల్లీ నగరంలోని ఎర్రకోట ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. వేడుకల కోసం మండి హౌజ్ మెట్రో స్టేషన్, ఐటీవో బిల్డింగులను అందంగా అలంకరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

