హైదరాబాద్ : తెలంగాణ భవన్ అంటేనే అస్తిత్వానికి చిరునామా అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. ఎన్నో పోరాటాలకు నిలయంగా తెలంగాణ భవన్ నిలిచిందన్నారు. తెలంగాణ భవన్ నిర్మాణం చేసి నేటికి 20 ఏండ్ల అయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చేతబడులంటూ రేవంత్ రెడ్డి తన చెత్తబుద్ధిని బయట పెట్టుకున్నారని విమర్శించారు.
రేవంత్ రెడ్డి క్షుద్ర పూజలు చేసి సీఎం అయ్యారా? అని ప్రశ్నించారు. ఈ నవీన యుగంలో సైన్స్ యుగంలో సీఎం రేవంత్ రెడ్డి క్షుద్ భాష మాట్లాడుతున్నారు. విద్యార్థులకు,భవిష్యత్ తరాలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారు? రేవంత్ రెడ్డిని అతని భార్య డాక్టర్ కు చూపించాలి అని ఎద్దేవా చేశారు. కొత్త పింఛన్ దరఖాస్తులో బీడీ కార్మికుల కాలమ్ పెట్టలేదు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు బీడీ కార్మికులను పట్టించుకోలేదు. కేసీఆర్ సీఎం అయిన తర్వాతనే బీడీ కార్మికులకు పింఛన్ ఇచ్చారన్నారు. కోరుట్ల నియోజకవర్గంలో ఎక్కువ మంది బీడీ కార్మికులు ఉంటారు. బీడీ కార్మికులకు ఉన్న పింఛన్లు తీసివేస్తారా అని నిలదీశారు.
కాంగ్రెస్ అంటేనే స్కామ్, పింఛన్లు ఇవ్వడానికి పైసలు వసూలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కిట్ తీసివేశారు. కల్యాణలక్ష్మీ పథకం రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక సంతాన లక్ష్మీ పథకంగా మారిందన్నారు. పెండ్లపుడు ఇవ్వాల్సిన కల్యాణ లక్ష్మి చెక్ ను పిల్లలు పుట్టాక ఇస్తున్నారు. కోటి మంది మహిళలను కోటేశ్వరులను చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి కనీసం 2,000 రూపాయలు ఇవ్వడం లేదని మండిపడ్డారు.
బీజేపీ ఎంపీలు ఉండి కూడా తెలంగాణకు చేసింది ఏమీలేదన్నారు. రేవంత్ రెడ్డి డన్నింగ్ క్రూగర్ ,బై పోలార్ డిసార్డర్ జబ్బులతో భాదపడుతున్నారు. డన్నింగ్ క్రూగర్ సిండ్రోమ్ అంటే ఏమి తెలవకున్నా తెలిసినట్టు మాట్లాడటం. బై పోలార్ డిజార్డర్ కొన్ని నిమిషాల్లోనే పరస్పర విరుద్ధంగా మాట్లాడటం అన్నారు. ఇప్పటికైనా సీఎం జ్ఞానం తెచ్చుకుని ప్రవర్తించాలి అని హితవు పలికారు. ఆయన వెంట కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై .సతీష్ రెడ్డి ,బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్ర చారి ఉన్నారు.
LIVE: తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే @drsanjayBRS మీడియా సమావేశంhttps://t.co/VR6IBiDRtY
— BRS Party (@BRSparty) August 14, 2026