నీలగిరి, సెప్టెంబర్ 27: నల్లగొండ జిల్లా కేంద్రం మీర్బాగ్కాలనీలోని షా రెసిడెన్సీ అపార్ట్ మెంట్లో గుంపుమేస్త్రీ ముత్తురాజు (38) దారుణ హ త్యకు గురయ్యాడు. టూ టౌన్ ఎస్సై సైదాబాబు తెలిపిన వివరాల ప్రకా రం.. తమిళనాడులోని తూత్తుకుడికి చెందిన మరియన్ ముత్తురాజు గుంపు మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన గణేశన్, పరమేశన్, ధనరాజును ఓ షాపింగ్ మాల్లో ఎలివేషన్ పనులు చేయడానికి తీసుకొచ్చాడు. వీరు మీర్బాగ్ కాలనీలోని షా రెసిడెన్సీ అపార్ట్మెంట్లోని 402 ఫ్లాట్లో ఉంటున్నారు.
వీరంతా శనివారం పనికి వెళ్లకుండా ప్లాట్లోనే మద్యం సేవిస్తున్న సమయంలో కూలి డబ్బుల విషయంపై ఘర్షణకు దారితీసింది. ముత్తు రాజు రోజు కూలి రూ.1,000 ఇస్తానని చెప్పి అందులో కమీషన్ పేరుతో రూ.200, భోజనం ఖర్చు పేరుతో రూ.150 తగ్గించి రూ. 650 ఇస్తానని చెప్పడంతో.. మద్యం మత్తులో ఉన్న గణేశన్, పరమేశన్ కలిసి ముత్తు రాజు తలను నేలకేసి బ లంగా బాదారు. దీంతో తీవ్ర గాయాలైన రాజు అతడు అకడికకడే మృతి చెందాడు. గమనించిన ధనరాజు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.