Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
Kolkata's Presidency University | స్వామి వివేకానంద ఫొటో ఉన్న పోస్టర్‌పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు రాసి అవమానించిన ఇద్దరు విద్యార్థినులపై యూనివర్సిటీ చర్యలు చేపట్టింది. వారిని బహిష్కరించింది. అలాగే భవిష్యత్తులో ఆ యూనివర్సిటీ నుంచి ఏ డిగ్రీ ప్రోగ్రామ్‌లోనూ ప్రవేశానికి వారు అర్హులు కారని పేర్కొంది.
కోల్‌కతా: స్వామి వివేకానంద ఫొటో ఉన్న పోస్టర్‌పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు రాసి అవమానించిన ఇద్దరు విద్యార్థినులపై యూనివర్సిటీ చర్యలు చేపట్టింది. వారిని బహిష్కరించింది. అలాగే భవిష్యత్తులో ఆ యూనివర్సిటీ నుంచి ఏ డిగ్రీ ప్రోగ్రామ్‌లోనూ ప్రవేశానికి వారు అర్హులు కారని పేర్కొంది. (Kolkata’s Presidency University) పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయం ఈ నిర్ణయం తీసుకున్నది. అక్టోబర్ 13న స్వామి వివేకానంద ఫొటో ఉన్న పోస్టర్‌ను ఆ యూనివర్సిటీ ప్రాంగణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఏర్పాటు చేసింది. అయితే ఇద్దరు మహిళా విద్యార్థులు ఆ పోస్టర్‌పై అవమానకరమైన వ్యాఖ్యలు రాసినట్లు ఏబీవీపీ ఆరోపించింది. నిష్పక్షపాత విచారణ జరుపాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏబీవీపీ విద్యార్థులు యూనివర్సిటీ గేటు బయట నిరసన కూడా చేపట్టారు.
కాగా, ఈ సంఘటనపై ఒక విచారణ కమిటీని ఆ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో పాటు అధ్యాపకులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ఇతరుల నుంచి వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు విద్యార్థినులపై ప్రెసిడెన్సీ యూనివర్సిటీ చర్యలు చేపట్టింది. వారిద్దరిని యూనివర్సిటీ నుంచి బహిష్కరించింది. అలాగే భవిష్యత్తులో ఏ డిగ్రీ ప్రోగ్రామ్‌లోనూ ప్రవేశానికి వారు అర్హులు కారని పేర్కొంది. అయితే బహిష్కరించిన ఆ ఇద్దరు మహిళా స్టూడెంట్స్ వివరాలను ఆ యూనివర్సిటీ వెల్లడించలేదు.
మరోవైపు ఈ సంఘటనలో తమ ప్రమేయం ఏమీ లేదని వామపక్ష అనుబంధ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) తెలిపింది. తమపై వచ్చిన ఆరోపణలను ఖండించింది. స్వామి వివేకానందను అవమానించే చర్యను ఏ వామపక్ష సంస్థ చేపట్టలేదని, అందులో పాల్గొనలేదని పేర్కొంది. హిందువుల మతపరమైన మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదని కూడా ఎస్ఎఫ్ఐ తెలిపింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరిపి, బాధ్యులుగా తేలిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ప్రభుత్వ ధాన్యానికి ఎగనామం.. రూ.12 కోట్ల సీఎంఆర్ బియ్యం గల్లంతు
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

