Vemulawada | వేములవాడ, మార్చి 3 : వేములవాడ పట్టణంలో గ్రామ సింహాల దాడిలో 35 మంది గాయపడ్డారు. సోమవారం రాత్రి నుండి మంగళవారం ఉదయం వరకు పదుల సంఖ్యలో ప్రజల మీదికి దాడికి దిగాయి. దీంతో పట్టణంలోని బద్ది పోచమ్మ వీధి, వడ్ల కమ్మరి వీధి, పాత కూరగాయల మార్కెట్ ఏరియా, సుభాష్ నగర్, దోబీగాట్ల పరిసరాల్లో ప్రజలను గాయపరిచాయి. సుమారు 35 మంది దాకా ఈ గ్రామ సింహాల దాడిలో గాయపడగా వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.
ఇందులో వరంగల్ జిల్లాకు చెందిన కొందరు భక్తులు కూడా ఉన్నట్లు తెలిపారు. ఏరియా ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ నవీన్ మాట్లాడుతూ గాయపడిన వారికి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. గత నెల రోజుల వ్యవధిలో రెండవసారి ఈ దాడి జరగడం పట్టణ ప్రజలు భయాందోళన గురవుతున్నారు.