వేములవాడ, డిసెంబర్ 24: వేములవాడలో శునకాలు రెచ్చిపోయాయి. బుధవారం రాజన్న దర్శనానికి వచ్చిన భక్తులపై రెండు శునకాలు దాడి చేశాయి. గోకుల్ కాంప్లెక్స్ ఏరియా, జాతర గ్రౌండ్ ప్రాంతంలో దాదాపు తొమ్మిది మందిని గాయపరిచాయి.
అందులో వరంగల్ జిల్లాకు చెందిన భక్తులు ఉండగా మరికొందరు ఇతర జిల్లాల చెందిన భక్తులు ఉన్నారు. వీరిని వేములవాడ ఏరియా దవాఖానకు తరలించగా, వైద్యసేవల అనంతరం తిరిగి వారి స్వగ్రామాలకు వెళ్లిపోయారు. తొమ్మిది మందికి వైద్య సేవలు అందించినట్టు వైద్యులు తెలిపారు. గాంధీనగర్ ప్రాంతంలోనూ కొందరు స్థానికులపై కూడా దాడి చేశాయని కాలనీవాసులు తెలిపారు.