పెద్దపల్లి కమాన్, ఏప్రిల్ 30 : పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు పదో స్థానం దక్కింది. గతేడాది వరకు ఉన్న గ్రేడింగ్ విధానాన్ని ఎత్తివే సి, ఈ విద్యా సంవత్సరం ఫలితాల్లో మార్కులను ప్రకటించారు. ఎప్పటిలాగే ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా గురుకులాలు, ప్రభు త్వ స్కూల్ విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు సాధించారు. జిల్లాలో మొత్తం 7,387మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 7157 మంది పాస్ కావడంతో 96.89శాతం ఉత్తీర్ణత సా ధించారని డీఈవో డీ మాధవి తెలిపారు. బాలికలు 3,603మంది పాసై 97.67శాతం, బాలురు 3554 మంది పాసై 96.11 ఉత్తీర్ణత శాతం పొందినట్లు తెలిపారు. గతంలో లాగే ఈసారి కూడా బాలికలదే హవా కొనసాగింది. కాగా, జిల్లా 2023 ఫలితాల్లో 9వ స్థానంలో నిలువగా, 2024లో 8వ స్థానం, ఈ ఏడాది పదో స్థానానికి దిగజారింది.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాం లో ఏర్పాటు చేసిన గురుకులాల్లో విద్యార్థులు విజయదుందుభి మోగించారు. జిల్లాలోని ఆరు సోషల్ వెల్ఫేర్ (తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాలు)లో 445మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 442మంది పాసై 99. 32ఉత్తీర్ణత శాతం సాధించారు. మల్లాపూర్, గర్రెపల్లి, మంథని, రామగుండం, గురుకులాల్లో వంద శాతం, పెద్దపల్లిలో 97.02, నం దిమేడారంలో 98.68శాతం ఉత్తీర్ణత పొందా రు. మంథని గురుకుల విద్యార్థి ఎం అజయ్‌కుమార్ అత్యధికంగా 573మార్కులు సాధించాడు. జిల్లాలోని ఐదు మహాత్మాజ్యోతిబా ఫూలే గురుకులాల్లో 328 మంది విద్యార్థులకు 324మంది పాసై 97.8ఉత్తీర్ణత సాధించారు. పెద్దపల్లి (బాలికలు), రామగుండం (బాలికలు), సుల్తానాబాద్ (బాలురు)లో వందశాతం, గుంజపడుగు (బాలికలు)లో 95.45, రామగుండం (బాలురు)లో 98 శాతం ఉత్తీర్ణత సాధించారు. సుల్తానాబాద్ బాలుర గురుకుల విద్యార్థి ప్రేమ్‌తేజ్ 582 మార్కులు సాధించి జిల్లాలోని గురుకుల విద్యాసంస్థల్లో ప్రథమ స్థానంలో నిలిచాడు.
జిల్లాలోని మూడు మైనార్టీ గురుకులాల్లో ని విద్యార్థులందరూ ఉత్తీర్ణులై అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. పెద్దపల్లి మై నార్టీ బాలికలు-1, రామగుండం బాలుర-1, మంథని బాలికలు-1 విద్యాలయాల్లో మొత్తం 133మంది విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణులయ్యారు. పెద్దపల్లి గురుకుల విద్యార్థిని బీ విశ్వశ్రీ 586, మంథని గురుకుల విద్యార్థిని జీ శ్రీనిత్య 574, రామగుండం గురకుల విద్యార్థి కే అనిల్‌కుమార్ 545అత్యుత్తమ మార్కులు సాధించినట్లు ఆయా విద్యాలయాల ప్రిన్సిపాల్స్ తెలిపారు.
జిల్లాలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లోని (కేజీబీవీ) విద్యార్థులు విజయభేరి మోగించారు. మొత్తం పది కేజీబీవీల్లో 423 మంది విద్యార్థినులు పరీక్ష రాయగా, 420 మంది పాసై 99.29శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎనిమిది కేజీబీల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించగా, రామగిరి కేజీబీవీ విద్యార్థిను లు ఎస్ శ్రీజ, ఎస్ వర్షిత అత్యధికంగా 580 మార్కులు సాధించారు. విద్యార్థులను డీఈ వో డీ మాధవి అభినందించారు.
పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 30: పదో తరగతి ఫలితాల్లో పెద్దపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలదే బాలికల హవా కొనసాగింది. 96.94ఉత్తీర్ణత శాతం నమోదైంది. పెద్దపల్లి పట్టణంలోని మైనార్టీ రెపిడెన్షియల్ బాలికల పాఠశాలలో ఓదెల మండలం బోడకుంటకు చెందిన విశ్వశ్రీ 586మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచింది. నిట్టూరు జడ్పీహెచ్ఎస్కు చెందిన కుంబాల నిత్యా మీన 584, పోతని ఐశ్వర్య 575, రూపప్రియ 562 మార్కులు సాధించారు. పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో 98.75 శాతం ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులను జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి రంగారెడ్డి, ఎంఈవో సురేందర్‌కుమార్ అభినందించారు.
ఎలిగేడు, ఏప్రిల్ 30: మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. 21మంది విద్యార్థులు పరీక్ష రా యగా, అందరూ పాస్ అయ్యారు. కోడూరి సాహిత్య 549, బైకం అక్షయ 485మార్కులతో మండల టాపర్లుగా నిలువగా, వీరిని ఎంఈవో నరేంద్రచారి అభినందించారు.
యైటింక్లయిన్‌కాలనీ ఏప్రిల్ 30: సింగరేణి సంస్థ ఆర్జీ-2 ఏరియాలోని సెక్టార్-3 పాఠశాలలో 65మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 64 మంది (99శాతం) ఉత్తీర్ణత సాధించారు. పీ అక్షర 556, బీ పవన్ 526, ఈ హర్ష 525తోపాటు 12మంది విద్యార్థులు 500కి పైగా మార్కులు సాధించారు. వీరిని ఏరియా జీఎం బండి వెంకటయ్య తన కార్యాలయంలో అభినందించారు.
ధర్మారం, ఏప్రిల్ 30: మండలంలో 97. 98ఉత్తీర్ణతశాతం నమోదైందని ఎంఈవో పీ ప్రభాకర్ తెలిపారు. నంది మేడారం, నర్సింహులపల్లి, కొత్తూరు జడ్పీ ఉన్నత పాఠశాలలు, ధర్మారంలోని కేజీబీవీ, నంది మేడారం తెలంగాణ బాలుర గురకుల విద్యాలయం, మల్లాపూర్ బాలికల గురుకుల విద్యాలయా లు వందశాతం ఫలితాలు సాధించాయి. నం దిమేడారం బాలికల గురుకుల విద్యాలయం లో బీ నవిత 568, ధర్మారం మోడల్ స్కూ ల్లో ఏ సిద్దార్థ 566, ధర్మారం కేజీబీవీలో బీ కీర్తన 563, దొంగతుర్తి జడ్పీ హెచ్‌ఎస్‌లో వీ ప్రియాంక 562 మార్కులను సాధించారని ఎంఈవో తెలిపారు.
కాల్వశ్రీరాంపూర్, ఏప్రిల్ 30: మండలం లో మొత్తం 309మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాయగా, 302మంది (97.7 శాతం) ఉత్తీర్ణత సాధించారని ఎంఈవో మహేశ్ తెలిపారు. మల్యాల మోడల్ స్కూల్ లో సహస్ర వర్షిణి 564, కావ్య 563మార్కు లతో మండల టాపర్‌గా నిలిచారన్నారు.
ముత్తారం, ఏప్రిల్ 30: మండలంలో 183మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 177 మంది పాస్ కావడంతో 97ఉత్తీర్ణత శా తం నమోదైంది. ముత్తారం కేజీబీవీకి చెందిన కే శ్రీవైష్ణవి 557, టీ సహస్త్ర 555, దర్యాపూర్ మోడల్ సూల్కు చెందిన ఎల్ స్వాతి 547, ముత్తారం జడ్పీహెచ్ఎస్కు చెందిన ఎం ఇంద్రాణి 529, లకారం జడ్పీహెచ్ఎస్కు చెందిన ఏ సంయుక్త 521, ఓడేడు జడ్పీహెచ్ఎస్కు చెందిన ఎం చైతన్య 520, అడవిశ్రీరాంపూర్ జడ్పీహెచ్ఎస్కు చెందిన ఎన్రాంచరణ్ 509 మారులు సాధించారు. వీరిని ఎంఈవో హరిప్రసాద్ అభినందించారు.
జూలపల్లి, ఏప్రిల్ 30: మండలంలో 186 మంది పరీక్షలు రాయగా, 175మంది (95 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ఎంఈవో సరస్వతి వెల్లడించారు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పాటకుల అశ్విత 568, బాలికల ఉన్నత పాఠశాల నుంచి గుంటి అనూష 560, జూపిటర్ ఉన్నత పాఠశాలలో నాడెం లక్ష్మిరిత్విక 555 మార్కులు సాధించి మండల టాపర్లుగా నిలిచారన్నారు. వడ్కాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూపిటర్, జూలపల్లి బాలికల ఉన్నత పాఠశాలల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. తేలుకుంట ఉన్నత పాఠశాలలో అత్యల్పంగా 79శాతం మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు.
కమాన్‌పూర్, ఏప్రిల్30: మండలం 129 మంది పరీక్ష రాయగా, 123మంది ఉత్తీర్ణత (95శాతం) సాధించారు. జూలపల్లిలో శ్రీ వరుణ్ 572 మండల టాపర్‌గా నిలిచాడు. రొంపికుంటలో అక్షర 566, ప్రజ్ఞ 554, రాకేశ్ 552, రఘునాథ్ 545, సమస్ర 536, కమాన్‌పూర్‌లో శ్రీవర్ష 548 మార్కులు సాధించగా, వీరికి ఎంఈవో, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు.
రామగిరి, ఏప్రిల్30: మండలంలో 167 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 158 మంది ఉత్తీర్ణత (94.6శాతం) సాధించారు. కేజీబీవీ పాఠశాల విద్యార్థులు ఎస్ వర్షిత 580, సిరిపురం శ్రీజ 580 మార్కులతో మం డల టాపర్‌గా నిలిచినట్లు ఎంఈవో కొంర య్య తెలిపారు. కాగా, బేగంపేట జడ్పీహెచ్ఎస్ నుంచి రషిత 558, చందనాపూర్ నుంచి శ్రీజ 557, బేగంపేట నుంచి శ్రీమంతుల లోహిత 557 మార్కులు సాధించారు.
మంథని, ఏప్రిల్30: మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకు ల పాఠశాల/కళాశాలలో ఎం అజయ్‌కుమార్ 573, అభినవ్ 566, కౌశిక్, భార్గవ్ 563 మారులు సాధించగా, వంద శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ శ్రీనా థ్ తెలిపారు. స్థానిక జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో సూతారి సాత్విక్ రాజ్ 562, బేర ఆదిత్యతేజ్ 561, జడ్పీహెచ్ఎస్ బాలిక ల పాఠశాలలో అవధానుల సంజన 561, లక్ష్మీప్రసన్న 544, ఇందు530, అక్షయ 50 9, స్నేహ 521, గుంజపడుగు హైస్కూల్లో రిషిత 530, రవికుమార్ 528, కన్నాల హై స్కూల్లో చరణ్‌తేజ్ 520, ఆరెంద జడ్పీహెచ్ఎస్లో బండారి సిరి 510, జనగామ రాం చరణ్ 503 మార్కులు సాధించారు.
సుల్తానాబాద్, ఏప్రిల్ 30 : పదో తరగతి ఫలితాల్లో సుల్తానాబాద్ అల్ఫోర్స్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. రాష్ట్ర ర్యాంకులతోపాటు వంద శాతం ఉత్తీర్ణత సాధించి ముందువరసలో ఉన్నారు. 114మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, పూర్తి ఉత్తీర్ణతతో పాటు బోజ్జ సాత్విక్ 589 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో సత్తాచాటాడు. 580కి పై 16 మంది, 550కి పైగా 54మంది మార్కులు సాధించారని విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి తెలిపారు. అకుల విష్టుప్రియ 588, కర్రె ఐశ్వర్య 587, తన్నీరు చరణ్‌కుమార్ 587, వేములవాడ అక్షర 585, మధుశాలీని 584, కర్రె వినయ్ 584, గొపిడి అఖిలరెడ్డి 583, కొటగిరి ప్రణయ్ 583, పొల్సాని అఖిల్రావు 583, గన్నమనేని ఐశ్వర్య 581, తూముల కిశోర్ 581, కూర సహస్రరెడ్డి 580, వీరగోని బృహతి 580, అర్రం రంజిత్‌రెడ్డి 580, కొడం సుకృతి 580 అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.