Government schools | కాల్వ శ్రీరాంపూర్. మే 31 : కాల్వశ్రీరాంపూర్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాల పంపిణీ చేసినట్లు మండల విద్యాధికారి ఎస్ మహేష్ తెలిపారు. ప్రతీ సంవత్సరం ప్రభుత్వం అందించే పాఠ్య పుస్తకాలు అన్ని పాఠశాలకు శనివారం మండల విద్యా వనరుల కేంద్రం నుండి ప్రారంభించినట్లు ఎంఈఓ తెలిపారు. ఇప్పటికే నోటు పుస్తకాలు సైతం అన్ని పాఠశాలలకు అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్సీలు ఆయా పాఠశాలల హెచ్ఎంలు సిబ్బంది ఉన్నారు.