Odela | ఓదెల, ఆగస్టు 31 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులను సర్పంచ్ కనికి రెడ్డి సతీష్, పాలకవర్గ సభ్యులు సోమవారం పంపిణీ చేశారు. ప్రభుత్వం నూతనంగా అందజేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ కార్యక్రమం గ్రామపంచాయతీ ఆవరణలో చేపట్టారు. ప్రజలు గ్రామపంచాయతీకి వచ్చి తమ రేషన్ కార్డును తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోపతి శ్రీలత-ప్రవీణ్, పంచాయతీ కార్యదర్శి నగునూరి వెంకట లక్ష్మణ్ గౌడ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.