Chigurumamidi | చిగురుమామిడి, జూన్ 22 : చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో హార్వెస్ట్ మినిస్ట్రీస్ హైదరాబాద్ వారి మహిళా సాధికారత కార్యక్రమంలో భాగంగా నాలుగు నెలల పాటు నిర్వహించిన డోర్కాస్ కుట్టుమిషన్ శిక్షణ సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా పదిమంది శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లతో పాటు రూ.12 వేల విలువగల కుట్టుమిషన్లను సర్పంచ్ సాంబారి భారతమ్మ కొమురయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు కుట్టు మిషన్ల శిక్షణ ఎంత దోహదపడతాయన్నారు.
కుటుంబ ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు శిక్షణ మహిళలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ఉమా శాంత కుమార్, ఉప సర్పంచ్ పైడిపల్లి వెంకటేష్, కోఆర్డినేటర్ శ్రీధర్, మాజీ ఎంపిటిసి సాంబారి కొమురయ్య, వార్డు సభ్యులు రేణుక, కీర్తన, మాజీ ఉపసర్పంచ్ కయ్యం తిరుపతి మహిళలు పాల్గొన్నారు.