Distribution | ధర్మారం, ఆగస్టు 28: వినాయక చవితిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో భక్తులకు స్థానిక సాయి మణికంఠ మోడ్రన్ హై స్కూల్ ఆధ్వర్యంలో మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ చేశారు. పాఠశాల విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ కోసం తయారు చేసిన మట్టి గణపతి భక్తులకు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ జైన సురేష్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో సుమారు 500 పైగా మట్టి విగ్రహాలను పంపిణీ చేశామని అన్నారు. భక్తులంతా తమ ఇండ్లలో మట్టి గణపతులను పూజించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటును అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.