కోరుట్ల, ఆగస్టు 11: కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు సీఎం కేసీఆర్ చేయూతను అందిస్తున్నారని, బీసీ బంధు కింద లక్ష సాయం చేస్తున్నారని ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం కోరుట్ల పట్టణంలోని కట్కం సంగయ్య ఫంక్షన్ హల్లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం గ్రామాలకు చెందిన 300 మంది లబ్ధిదారులకు మంజూరైన బీసీ బంధు చెక్కులను అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) దివాకర్‌తో కలిసి అందజేశారు. ముందుగా బీఆర్ఎస్ కౌన్సిలర్ పోగుల ఉమారాణి భర్త పోగుల లక్ష్మీరాజం మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం జరిగిన కార్యక్రమం లో ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు కులవృత్తులను పట్టించుకోలేదన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ దేశంలోనే ఎక్కడా లేని విధంగా అనేక పథకాలతో భరోసాకల్పిస్తున్నార న్నారు. నియోజకవర్గంలో బీసీ బంధు కింద 1600 మందిని ఎంపిక చేశామని, ప్రతి నెలా 300 మందికి ఆర్థిక సాయం అందిస్తామన్నారు. అర్హులందరికీ విడతల వారీగా అమలు చేస్తామ ని ఆందోళన చెందవద్దని సూచించారు. 1100 మందికి దళిత బంధు అందిస్తామని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లు లేని 3వేల మంది నిరుపేదలకు పక్కా గృహలు నిర్మించి ఇస్తామన్నారు. సొంత స్థలం కలిగి ఉండి ఇండ్లు నిర్మించుకునే స్థోమత లేని వారికి గృహలక్ష్మి కింద 3 లక్షలు అందిస్తామన్నారు. కోరుట్ల పట్టణంలో గూడు లేని నిరుపేదలకు పట్టణ శివారులోని జంబి గద్దె సమీపంలో ఉన్న 52 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఎంపిక చేశామని, అందులో 25 ఎకరాల్లో నిరుపేదలకు 75 గజాల చొప్పున భూమిని కేటాయించి ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు అధికారులతో సమాలోచనలు చేస్తున్నామని చెప్పారు. అడుగకముందే అన్నీ ఇస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కాపాడుకోవాల్సిన ప్రజలకు ఉందని చెప్పారు. ప్రతిపక్షాల మాట లు నమ్మి ఆగం కావద్దని సూచించారు. ఇక్కడ కోరుట్ల ఆర్డీవో రాజేశ్వర్, ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్రావు, కోరుట్ల, మెట్పల్లి మున్సిపల్ చైర్ పర్సన్లు అన్నం లావణ్య, రణవేని సుజాత, మున్సిపల్ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు, సర్పంచ్ల ఫోరం జిల్లా గౌరవాధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, ఎంపీపీలు తోట నారాయణ, మారు సాయిరెడ్డి, జడ్పీటీసీలు దారిశెట్టి లావణ్య, శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.