Dharmaram | ధర్మారం, ఏప్రిల్ 28 : ధర్మారం మండల కేంద్రంలో వారసంతకు వచ్చే ప్రజల దాహార్తి తీర్చడం కోసం కరీంనగర్ దరూల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో తీర్చడానికి కూల్ మినరల్ వాటర్ తో చలివేంద్రం ఏర్పాటు చేయగా దానిని మంగళవారం స్థానిక ఎస్సై ఎం ప్రవీణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చలివేంద్రం నిర్వాహకులను ఎస్ఐ అభినందించారు. ప్రస్తుతం ఎండలు మండిపోతున్న సమయంలో ప్రజల కోసం చలివేంద్రం ఏర్పాటు చేయడం ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా దారూల్ ఖైర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా చైర్మన్ డాక్టర్ ఖద్దూస్ మాట్లాడుతూ మానవసేవే- మాధవసేవ అనే దానికి నిర్వచనంగా ప్రజల దాహం తీర్చడానికి కూల్ మినరల్ వాటర్ తో చలివేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం మద్యం వ్యసనం అనేది అన్ని ఆకృత్యాలకు తల్లి అని ముద్రించిన గోడపత్రిక విడుదల చేశారు. అనంతరం ఎస్సై ప్రవీణ్ కుమార్ను శాలువతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు ఆబిద్, ధర్మారం మండల దరూల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఎండీ గౌస్ బాబా, సొసైటీ సభ్యులు జాఫర్, జావిద్, షకీల్, యఖూబ్, రఫీ, షరీఫ్, ఆజం, జకీర్, నూనె అజయ్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.