Dharmaram | ధర్మారం, మార్చి 6 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రం లో పలు ప్రధాన కూడళ్లలో గ్రామాలకు మార్గ దిక్సూచి (సైన్ బోర్డు) లను స్థానిక పీపుల్స్ యువసేన అధ్యక్షుడు మేకల సంజీవరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ధర్మారం మండల కేంద్రంలో కరీంనగర్-రాయపట్నం రహదారిలో కొత్తపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన కూడలి వద్ద రిక్వెస్ట్ బస్ స్టాప్ బోర్డు, అలాగే మోడల్ స్కూల్ వెళ్లేదారిలో కూడలి బొమ్మరెడ్డిపల్లి, కొత్తపల్లి గ్రామాలకు వెళ్లి మార్గాల సూచిక బోర్డులను ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులు, కొత్తపల్లి, బొమ్మరెడ్డిపల్లి గ్రామాలకు ప్రజలు సులభంగా వెళ్లడానికి అట్టి బోర్డులను ఏర్పాటు చేసినట్లు సంజీవరావు తెలిపారు. ఇట్టి బోర్డులను స్థానిక దాగేటి ప్రవీణ్ యాదవ్ ఫౌండేషన్ అధ్యక్షుడు యాదవ్ శుక్రవారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సంజీవరావుతోపాటు ఉపాధ్యక్షుడు తిరుపతి, సంయుక్త కార్యదర్శి దాసరి లక్ష్మణ్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాజ్ కుమార్, ధర్మారం ఉప సర్పంచ్ ఎలిగేటి మల్లేశం, వార్డు సభ్యులు సాద వెంకటేష్, బొమ్మగాని సతీష్, జవ్వ్పీపుల్స్ యువసేన సభ్యులు బైకని కొమురయ్య, వనం లక్ష్మణ్, అరుకుటి రాజ్, కుమార్, మేడవేని శ్రీనివాస్, గుమ్ముల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.