Dharmapuri | ధర్మారం లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయం.. జిల్లా రెండో ఉప గవర్నర్ లయన్ డాక్టర్ ఉదారీ చంద్రమోహన్ గౌడ్
ధర్మారం లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయమని ఈ క్లబ్ కు జిల్లాలో ఎంతో ప్రఖ్యాతి ఉందని లయన్స్ క్లబ్ 320జీ జిల్లా రెండో ఉప గవర్నర్ లయన్ డాక్టర్ ఉదారీ చంద్రమోహన్ గౌడ్ అన్నారు.
Dharmapuri | ధర్మారం, జూన్ 21 : ధర్మారం లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయమని ఈ క్లబ్ కు జిల్లాలో ఎంతో ప్రఖ్యాతి ఉందని లయన్స్ క్లబ్ 320జీ జిల్లా రెండో ఉప గవర్నర్ లయన్ డాక్టర్ ఉదారీ చంద్రమోహన్ గౌడ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం బొమ్మ రెడ్డి పల్లి లోని మహేశ్వర ఫంక్షన్ హాల్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం అధ్యక్షుడు ఇప్ప మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారోత్సవానికి ఆయన హాజరయ్యారు. 2026 -2027 సంవత్సరానికి గాను జూలై 1 నుండి బాధ్యతలు స్వీకరించనున్న నూతన అధ్యక్షుడు చింతపండు నర్సింగం, కార్యదర్శి కట్ట రమేష్, కోశాధికారి కడారి కుమార్ తోపాటు కార్యవర్గం చేత ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా ఈ డాక్టర్ ఉదారి చంద్రమోహన్ గౌడ్ మాట్లాడుతూ ధర్మారంలో క్లబ్ ఏర్పాటు అయినప్పటి నుంచి ఇక్కడ సేవా కార్యక్రమాల్లో అగ్ర శ్రేణిలో నిలుస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఉమ్మడి కరీంనగర్ అదిలాబాద్ జిల్లాలోని క్లబ్ లకు పోటీగా నిలబడి ముందుకు సాగడం ఆనందదాయకమని ఆయన పేర్కొన్నారు. ఈ క్లబ్ ద్వారా ఇప్పటివరకు ముగ్గురు రీజియన్ చైర్మన్ల తో పాటు ఆరుగురు జోన్ చైర్మన్లు ప్రాతినిధ్యం వహించడం క్లబ్ విశిష్టత గా ఆయన పేర్కొన్నారు . కొత్తగా ఏర్పాటైన క్లబ్ కార్యవర్గ సభ్యులు సేవా కార్యక్రమాలను చేసి ప్రజల మన్ననలు పొందాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ లయన్ మోర బద్రేశం అందించిన జిల్లా పిన్ తో పాటు, సేవా కార్యక్రమాల ప్రగతి పుస్తకాలను అందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా క్యాబినెట్ సెక్రటరీ ఓల్లాల కృష్ణ హరి, జిల్లా క్యాబినెట్ అడిషనల్ ట్రెజరర్ కొల్లూరు జితేందర్, డిస్టిక్ మైక్రో క్యాబినెట్ మెంబర్, డిస్టిక్ పీఆర్వో తన్నీరు రాజేందర్, డిస్టిక్ మైక్రో క్యాబినెట్ మెంబర్, ఫార్మర్ సపోర్ట్ సామ ఎల్లారెడ్డి, జిల్లా జీఎస్టీ కోఆర్డినేటర్ సాదుల వెంకటేశ్వర్లు, ప్రోగ్రాం చైర్మన్ లయన్ డాక్టర్ కామనీ శ్రీనివాస్, కో చైర్మన్ లయన్ పుచ్చకాయల మునీందర్ రెడ్డి, రీజియన్ చైర్మన్ లయన్ కావేటి రాజగోపాల్, జోన్ చైర్మన్ తలమక్కి రవీందర్ శెట్టి, క్లబ్ కార్యదర్శి కట్ట రమేష్, కోశాధికారి కడారి కుమార్, ప్రస్తుత కోశాధికారి మిట్టపల్లి చంద్రకాంతరెడ్డి, వైస్ ప్రెసిడెంట్, బోట్ల లక్ష్మీ నరసయ్య, క్లబ్ సభ్యులు లయన్ ఎండి ముజాహిద్, బండి రమేష్, ఆవుల మల్లేశం, ఈదుల శివకుమార్ రెడ్డి, అక్కినపల్లి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

