Jagityal | జగిత్యాల : శ్రావమాసం మొదటి శుక్రవారం సందర్భంగా భక్తులు ఆలయాలకు పోటెత్తారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస లలితామాత ఆలయంలో శుక్రవారం పెద్ద సంఖ్యలో మహిళలు అమ్మవారికి పూజలు చేసి ఓడిబియ్యం సమర్పించారు. లలితామాత ఆలయంలో ఎక్కడ లేని విధంగా 108 శ్రీ చక్రాలు ప్రతిష్టించగా ఆలయ ఫౌండర్ ట్రస్టి చైర్మన్ చెల్లం స్వరూప సత్తయ్య ఆధ్వర్యంలో సుహాసిని లలితసాహస్ర నామ పారాయణం చేసి శ్రీ చక్రాలకు భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజ నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయం, చింత కుంట చెరువు దగ్గర, జగిత్యాల కుంకుమ పూజలు చేశారు.
జగిత్యాల పట్టణ చింతకుంట లోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో శ్రీ ధనలక్ష్మి సేవా సమితి ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమార్చన, లలితా సహస్ర నామాల స్థోత్ర పారాయణం చేశారు. అనంతరం అమ్మ వారికి ఒడి బియ్యం సమర్పించారు. కుంకుమ పూజ అనంతరం లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి వారికి అమ్మ వారి శేష వస్త్రం, చీరను ఆలయ పూజారి ఆశీర్వచనాలతో సత్కరించారు. ఈ కార్యక్రమములో ఎన్నం కిషన్ రెడ్డి, కళాశ్రీ అధినేత గుండేటి రాజు, పాంపట్టి రవీందర్, మార కైలాసం, రాజేశం, రమేష్ రెడ్డి, ప్రభాకర్, ఉటూరి కళ్యాణి, అర్చన, పాంపట్టి సులోచన, మహేందర్, రాజేష్, వడ్లగట్ట రాజన్న, ఆర్గనైజింగ్ సెక్రటరీ వోడ్నాల శ్రీనివాస్, అర్చకులు చిలుకముక్కు నాగరాజు, మహిళా సమితి సభ్యులు స్వాతి, గీత, సంధ్య, జయ శ్రీ, అన్నపూర్ణ, తార, సుజాత, రమాదేవి, పుష్ప లత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.