Vemulawada | వేములవాడ రూరల్, జనవరి 8 : చెక్ డ్యాం రక్షణ కోసం ఏర్పాటు గోడను ఇసుక తరలించేందుకు టాక్టర్ యజమానులు కూల్చి వేసిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామంలో చోటుచేసుకుంది. మల్లారం మూలబాగు నుండి ఇసుకను తరలించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన చెక్ డ్యామ్ రక్షణ గోడను ఇసుక స్మగ్లర్లు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించేందుకు రక్షణ గోడ కూల్చి ఇసుకను తరలిస్తున్నారు.
మూలవాగుకు వెళ్లేందుకు రోడ్డు లేనందున చెక్ డ్యామ్ పక్కనే ఉన్న రక్షణ గోడను కూల్చివేయడంతో ఇసుక స్మగ్లర్లు యథేచ్ఛగా ఇసుక రవాణా చేపడుతున్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ అబూబరక్, ఇరిగేషన్ అధికారులు చూసి రక్షణ గోడను కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా రెండు రోజుల క్రితం గ్రామంలో జేసీబీ సహాయంతో రక్షణ గోడను కూల్చివేసినట్లు తెలిసింది. ట్రాక్టర్ ల రహదారి కోసమే కూల్చివేసిన్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నూతనంగా నిర్మించిన చెక్ డ్యామ్ లో రక్షణ గోడను కూల్చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.