Chakali Ailamma | ధర్మారం, సెప్టెంబర్10 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను రజక సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాత బస్టాండ్ లో ఉన్న ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం నాయకులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ధైర్యానికి, పోరాటానికి ప్రతీక ఐలమ్మని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు అర్ధవెల్లి రాము, నాయకులు గుడి కందుల ఎల్లయ్య, కాల్వ నర్సింగం, నేరెళ్ల రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.