Day care center | జగిత్యాల టౌన్ : జగిత్యాల జిల్లాలో ఒంటరిగా ఉన్న సీనియర్ సిటీజేన్స్(వృద్ధుల)కోసం బైపాస్ రోడ్డులో వయో వృద్ధుల సంక్షేమ శాఖ తరఫున డే కేర్ సెంటర్ ను సోమవారం సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమాధికారి బీ నరేశ్ మాట్లాడుతూ వృద్ధులు సామాజికంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఈ డే కేర్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వృద్ధుల కోసం డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ఆసుపత్రిలోని జెరియాట్రిక్ విభాగంతో డే కేర్ కేంద్రానికి లింక్ చేయడంతో వైద్యపరీక్షలతో పాటు, ఫిజియో థెరపీ సేవలు కూడా వృద్దులు పొందవచ్చని వివరించారు.
ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కృష్ణా రెడ్డి, సీనియర్ సిటీజెన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీ హన్మంత్ రెడ్డి, కోశాధికారి వెల్ముల ప్రకాష్ రావ్, పూసాల అశోక్ రావు, ఎడీ యాకూబ్, సత్యనారాయణ, ఎండీ ఇక్బాల్, కోరుట్ల అధ్యక్షుడు పబ్బా శివానందం, కథలాపూర్ అధ్యక్షుడు అల్లూరి బాపు రెడ్డి, మల్యాల అధ్యక్షుడు ముకుంద డేవారెడ్డి, ఎఫ్ఆర్వో కొండయ్య, సూపరింటెండెంట్ చంద్రమోహన్, సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.