Electric Shock | చిగురుమామిడి, డిసెంబర్ 15 : చిగురుమామిడి మండలంలోని రామంచ గ్రామంలో విద్యుత్ షాక్ తో పాడి పశువు మృతి చెందింది. గ్రామానికి చెందిన ఈరవేణి రాజు కు చెందిన పాడి పశువుమేత కోసం పొలంలో ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లింది. ప్రమాదవశాత్తు ఆవు దానికి తగలడంతో కరెంట్ షాక్ కు గురైంది. పాడి ఆవు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
ట్రాన్స్ఫార్మర్ కోసం వేసిన కుండీలు భూమిలోకి కూరికిపోయి ట్రాన్స్ఫార్మర్ హైట్ తగ్గి అటువైపు వెళ్లిన వారికి వైర్లు తగిలేలా ఉన్నాయని బాధిత రైతు రాజు పేర్కొన్నారు. పశువు రోజుకు 10 లీటర్ల వరకు పాలు ఇచ్చేదని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందజేయాలని పాల డైరీ అధ్యక్షుడు కూతురు మల్లారెడ్డి, కార్యదర్శి రంగు సంపత్, డైరెక్టర్ మానేటి మురళీధర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.