Crocodile | ధర్మపురి, జూలై26: ధర్మపురి వద్ద గోదావరి నదిలో మొసలి కలకలం సృష్టించింది. గోదావరి ఒడ్డున ఓ బండరాయిపై శనివారం సేదతీరుతున్నట్లు గా భక్తులకు మొసలి ప్రత్యక్షమైంది. శ్రావణమాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో నదికి స్నానానికి వస్తున్నారు. స్నానాలు చేసే చోటనే మొసలి ప్రత్యక్షమవడంతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు.
ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల రెండు రోజులుగా గోదావరి నది ఉధృతి స్వల్పంగా పెరిగింది. ఈ వరదలో మొసలి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. గతేడాది కూడా గోదావరిలో మత్స్యకారులకు మొసలి పిల్లలు ప్రత్యక్షమయ్యాయి. కాగా ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలిపేందుకు ప్రయత్నించగా అధికారులు స్పందించలేదు.