Dumping yard | కరీంనగర్ : కరీంనగర్లోని డంపింగ్ యార్డ్ లో చెలరేగుతున్న మంటల ద్వారా వస్తున్న పొగతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ ప్రజలు అనారోగ్యాలకు గురి అవుతున్నారని ఆరోపించారు.
చిన్నారులు తీవ్ర అవస్థలు పడుతున్నారని, శ్వాస సంబంధిత రోగాలతో ఆసుపత్రుల పాలు అవుతున్నారని పేర్కొన్నారు. డంపింగ్ యార్డులో మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన బయో మైనింగ్ పనులు సరిగా సగడం లేదని, ఈ పాటను వేగవంతం చేసి డంపింగ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ విషయంలో నగరపాలక అధికారులు పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని, వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు పైడిపల్లి రాజు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.