Chada Venkat Reddy | చిగురుమామిడి, జనవరి 11: చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామానికి చెందిన యాదవ సంఘం అధ్యక్షుడు, సీపీఐ నాయకుడు చెందవేని కుమారస్వామి ( 57) అనారోగ్యంతో శనివారం రాత్రి మృతి చెందాడు. కుమారస్వామి యాదవ సంఘం అధ్యక్షుడిగా గొల్ల, కురుమ కులస్తుల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. అలాగే సీపీఐ పెద్దమ్మ పల్లె శాఖ కార్యదర్శిగా అనేక కార్యక్రమాలు చేపట్టి పార్టీని పటిష్టపరిచారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుమారస్వామి మృతి వార్త తెలిసిన వెంటనే సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి, సింగిల్ విండో మాజీ డైరెక్టర్ చాడ శ్రీధర్ రెడ్డి, పెద్దమ్మపల్లి గ్రామ శాఖ కార్యదర్శి నీల వెంకన్న, బోయిని పటేల్, జిల్లా నాయకులు బోయిని అశోక్, యాదవ సంఘం మండల అధ్యక్షుడు ముక్కెర సదానందం, నాయకులు మ్యాకల రవీందర్, చందవేని సమ్మయ్య, మొగిలి ఓదెలు, మొగిలి బొందయ్య మృతదేహం వద్ద నివాళులర్పించారు.