BRS, BRSV | కాల్వ శ్రీరాంపూర్ జూలై 19 : ఆంధ్ర జలదోపిడీపై కాంగ్రెస్ పార్టీ చీకటి ఒప్పందం చేసుకుందని బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ జలదోపిడీపై విద్యార్థులకు శనివారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మల్యాల ఆదర్శ పాఠశాల ఇంటర్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ జల దోపిడీపై విద్యార్థులకు బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కర్రె దేవేందర్ రెడ్డి, రాజోజుల శివకుమార్, మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వానలు లేక రైతులు అల్లాడిపోతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కట్టే ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు నుండి 20 టీఎంసీల నీరును ఇస్తామని చీకటి ఒప్పందం చేసుకున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో సాగునీరు లేక రైతులు ఇబ్బంది పడుతుంటే పక్క రాష్ట్రానికి నీళ్లు ఇస్తానని ఒప్పుకోవడం విడ్డూరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి 20 టీఎంసీల నీరును తెలంగాణ రాష్ట్రానికి అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నిదానపురం దేవయ్య, కుకట్ల నవీన్ యాదవ్, ఓడ్నాల శ్రీనివాస్ , దర్ముల రవి, దబ్బేట శ్రీకాంత్, చిలుముల రాజేష్, తాండ్ర అనిల్ తదితరులు పాల్గొన్నారు.