Manthani | మంథని, ఫిబ్రవరి 6: గత అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారెంటీలు.. 420 హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ నాయకులు ఎక్కడిక్కడ నిలదీస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బాకీ కార్డునే ప్రచార అస్త్రంగా మల్చుకొని ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. మాయమాటలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిలదీస్తూ ముందుకు సాగుతున్నారు.
ఎన్నికల గ్యారెంటీ ప్రకారం 22 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం ప్రజలకు ఎంత బాకీ ఉందో అనేది పూర్తిగా అర్థమయ్యే విధంగా ప్రత్యేకంగా కార్డులను తయారు చేయించారు. రైతు భరోసా రైతు, కౌలు రైతుకు ఎకరానికి రూ. 76వేలు బాకీ, రుణమాఫీకి రూ. 2లక్షలు బాకీ, వంట బోనస్ రూ. 50వేల బాకీ, రైతు కూలీలకు రూ. 24వేలు, నిరుద్యోగులకు రూ. 88వేలు బాకీ, విద్యాభరోసా కార్డు విద్యార్థులకు రూ. 5లక్షలు బాకీ, ఆటో కార్మికులకు రూ. 24వేలు ప్రభుత్వం బాకీ ఉందని ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అభ్యర్థులను ఓట్లను అభ్యర్థిస్తూ ముందుకు సాగుతున్నారు.