తిమ్మాపూర్,ఫిబ్రవరి28 : పేదింటి ఆడబిడ్డ పెళ్లి కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుకు వచ్చి ఆర్థిక సాయం(Financial assistance) చేసి అండగా నిలిచారు. మల్లాపూర్ గ్రామానికి చెందిన ఉమా సంపత్ గౌడ్ కు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. పేద కుటుంబం కాగా పెద్ద బిడ్డ వివాహం నిశ్చయం అయింది.
కాగా వివాహానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయాన్ని గ్రామానికి చెందిన రాగుల పర్శరాములు గౌడ్ ద్వారా తెలుసుకొని మండల మాజీ వైస్ ఎంపీపీ తుమ్మనపల్లి శ్రీనివాస్ రావు 10వేలు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్.ఎల్ గౌడ్ 5వేలు, మామిడి అనిల్ 5వేలు, బుదారపు శ్రీనివాస్ 5వేలు, మల్లాపూర్ గ్రామానికి చెందిన రాగుల పర్శరాములు గౌడ్ 5వేలు, కర్ణబత్తుల మనోహర్ వేలు, గోపు మల్లారెడ్డి 2500, కాల్వ మల్లేశం 2,500 మొత్తం కలిపి 40 వేలను కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి వారి కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలోమండల నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.