KTR Senaa | సిరిసిల్ల రూరల్, మే 22: రాష్ట్రంలో ప్రజా పాలన చేస్తామని చెప్పి, పర్సంటేజ్ ల పాలన కొనసాగిస్తున్నారని కే టీ అర్ సేనా తంగళ్లపల్లి మండల అధ్యక్షుడు నందగిరి భాస్కర్ గౌడ్ ఆరోపించారు. ఈ మేరకు గురువారం తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ లో KTR సేన గ్రామ కమిటీ నీ పార్టీ నేతల సమక్షంలో నియమించారు. ఈ సందర్భంగా భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ ప్రజాపాలన అని చెప్పి పర్సెంటేజ్ ల పాలన చేస్తూ జనాలను పక్క దోవ పట్టిస్తూ, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకే గర్వకారమని, కాళేశ్వరం ప్రాజెక్టుపై విష ప్రచారం మానుకోవాలని హితువు పలికారు. తెర మీదకి ఏదోక సాకు పెట్టుకొని విష ప్రచారం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పే రోజు అతి దగ్గరలోనే ఉందన్నారు. ఎవరెన్ని నాటకాలు చేసిన అధర్మం పైన ధర్మం ఎపుడూ గెలుస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కాంగ్రెస్ నుండి BRS పార్టీ లోకి చేరిన మెరుగు శేఖర్ కి BRS పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం లో మండల ఉపాధ్యక్షులు మామిడాల విజయ్, రేగుల రాజు ప్రధాన కార్యదర్శి తౌటి శివ కృష్ణ, మామిడాల ఉమాశంకర్, సీనియర్ నాయకులు అల్వలా సాయిరాం, సాదుల భాస్కర్, వేముల శ్రీనివాస్, జక్కని రమేష్, వేముల సాగర్, సదానందం, రవి, నర్సయ్య, అంబదాస్, మాదాసు సత్యం, చిట్యాల నర్సయ్య, మీరుగు శేఖర్, రాజు పాల్గొన్నారు.
ఇందిరమ్మ కాలనీ కేటీఆర్ సేన గ్రామ కమిటీ సభ్యులు వీరే..
తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ కేటీఆర్ సేన గ్రామ కమిటీ అధ్యక్షుడిగా వేముల నరేష్ ను నియమించారు. అదే విధంగా గ్రామ శాఖ ఉపాధ్యక్షుడిగా గడ్డం కిరణ్, ప్రధాన కార్యదర్శి గా వేముల కిషన్, కార్యదర్శి గా సామల ప్రశాంత్, సలహదారుడిగా వేముల వెంకటేష్ , సోషల్ మీడియా ఇంచార్జ్ మెర్గు తిరుపతి, కొషాదికారిగా గోవింధు నాగయ్యను నియమించారు. ఈ సందర్భంగా నూతన కమిటీకి నియామక పత్రాలను స్థానిక పార్టీ నేతల చేతుల మీదుగా అందించి అభినందించారు.