Congress harassing | హుజూరాబాద్ టౌన్, జూన్ 16: కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులను అక్రమ కేసులతో వేధిస్తోంది ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఏసీబీ విచారణ నేపథ్యంలో ఆయనకు మద్దతుగా బండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్లోని తెలంగాణభవన్ కు కదిలివెళ్లారు.
అక్కడ మాజీ ఎంపీ వినోద్ కుమార్ ను, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశికెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. అక్రమ కేసులతో బీఆర్ఎస్ నాయకులను అడ్డుకోలేరని అన్నారు. ప్రజా గొంతుకై నిరంతరం కొట్లాడుతూనే ఉంటామని ఆయన అన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రమేష్, కానిగంటి శ్రీనివాస్, వెంకటేష్, సతీష్ తదితరులు ఉన్నారు.