Welfare of Yadavs | ఓదెల, మే 18 : రాష్ట్రంలో 16 శాతం జనాభా ఉన్న యాదవుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రాములు ఆరోపించారు. పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన ఆయన పర్యటించారు. ముందుగా యాదవ యూత్ రాష్ట్ర నాయకుడు పెగడ రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి పూలమాలలు శాలువాలతో సత్కరించారు.
ఈదురుగాలులతో కురిసిన వర్షానికి కరెంటు తీగలు తెగిపడి 25 గొర్రెలు చనిపోయి ఆర్థికంగా నష్టపోయిన ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన వేల్పుల రాజ కొమురయ్యకు రూ.10 వేల పరిహారాన్ని అందజేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారెంటీ లతా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో యాదవులకు ఇచ్చిన హామీలను విస్మరించారని ఆరోపించారు.
ఏడాది గడుపుతున్న యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదని తెలిపారు. అలాగే నామినేట్ పదవుల్లో యాదవులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఇతర కార్పొరేషన్ పదవుల కేటాయింపులో యాదవులను పట్టించుకోవడంలేదని తెలిపారు. యాదవులను పట్టించుకోకపోతే త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని తెల్చి చెప్పారు. వెంటనే యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.5 వేల కోట్ల నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు.