జిల్లాలోని మండల కేంద్రాల్లో ఆటో కార్మికులు, యూనియన్ ఆధ్వర్యంలో డ్రైవర్లు శుక్రవారం ఆందోళన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన బంద్‌ను పాటించి, రాస్తారోకో చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో తమకు ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
సిరిసిల్ల రూరల్, ఫిబ్రవరి 16: తంగళ్లపల్లి మండల కేంద్రంలో సిరిసిల్ల-సిద్దిపేట రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, యూనియన్ నాయకులు, సభ్యులు ఉన్నారు.
గంభీరావుపేట, ఫిబ్రవరి 16: మండల కేం ద్రంలో ఆటో యజమానులు తెలంగాణ అమర వీరుల స్తూపం వద్ద రోడ్డుపై ధర్నా చేశారు. అనంతరం వారు రోడ్డుపై వంటా వార్పు చేసి నిరసన తెలిపారు. ఆదర్శ ఆటో యూనియన్ అధ్యక్షుడు ఇబాదుల్లాఖాన్, సభ్యులు ఖలీల్, రమేశ్, మహేశ్, రాజారాం తదితరులు ఉన్నారు.
కోనరావుపేట, ఫిబ్రవరి 16: మండల కేం ద్రంతోపాటు ధర్మారంలో ఆటో యూనియన్ స భ్యులు రోడ్డుపై ధర్నా చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, ఉచిత బస్సుల ద్వారా ఆ టో కార్మికులకు అన్యాయం జరుగుతుందన్నా రు. ఆటో కార్మికుల పొట్టపై దెబ్బ కొట్టిందన్నా రు. ఇక్కడ ఆటో యూనియన్ సభ్యులున్నారు.
బోయినపల్లి, ఫిబ్రవరి 16: కాంగ్రెస్ ప్రభు త్వ మహాలక్ష్మి పథకంతో ఆటో కార్మికుల కు టుంబాలు రోడ్డుపడుతున్నాయని ఆటో యూనియన్ మండలాధ్యక్షుడు అంజ య్య ఆరోపించారు. మండల క్రేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. ఆటో కార్మికుల కష్టాలు తీర్చాలని కోరారు.
ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 16: మండల కేంద్రం లో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తె లిపారు. ఇక్కడ ఆటో యూనియన్ అధ్యక్షుడు పూదరి దేవరాజు, నాయకులు తాజ్, కానాపు రం అంజయ్య, గుండం శ్రీనివాస్, పొన్నం శ్రీనివాస్, కట్టెల బాలయ్య, నిజాం ఉన్నారు.