Mallapur | మల్లాపూర్, మే 20 : రైతులు పండించిన వరి, మక్కజొన్న పంటల కోనుగోళ్ల ప్రక్రియలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు మండిపడ్డారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో పీఎసీఎస్ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన వరిధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కేంద్రాల్లో ధాన్యం పోసి నెలలు గడుస్తున్న ఇప్పటికి తూకం వేయకపోవడం బాధకరమాని, కేంద్రాల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్రాల్లో గన్నీ సంచులు, హామాలీలు, లారీల కొరత ఉందని, ఇప్పటికైన ఉన్నత అధికారులు స్పందించి రైతులను సమస్యలను పరిష్కారించాలని కోరారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతమాని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు డాక్టర్ అనూప్ రావు, బీజేపీ మండలాధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు ఎర్ర లక్ష్మీ, చింతకుంట నర్సారెడ్డి, శేఖర్, కాంతయ్యచారి తదితరులు పాల్గొన్నారు.