Godavarikhani | కోల్ సిటీ, జూలై 23: గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన హెచ్ఎంఎస్ యూనియన్ మాజీ ఫిట్ సెక్రెటరీ తూడి రామస్వామి కమల దంపతులు అనాథ పిల్లల ఆకలి తీర్చారు. ఈ మేరకు బుధవారం స్థానిక గాంధీనగర్ లో గల ఎండీహెచ్ డబ్ల్యూఎస్ బాలల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఆశ్రమంలోని పిల్లల సమస్యలు అడిగి తెలుసుకొని ఒకరోజు అన్నదానం చేశారు. విధి వంచితులైన అనాథలకు అన్నదానం చేయడం మహాభాగ్యమని పేర్కొన్నారు.
ఒకరిద్దరు పిల్లలను పెంచి పెద్ద చేయడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఇంతమంది అనాధ పిల్లలను చేరదీసి వారికి తల్లిదండ్రులు లేని లోటు తెలియకుండా ఆకలికి అలమటించకుండా విద్యాబుద్ధులు చెప్పిస్తూ ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్న ఆశ్రమ నిర్వాహకులు పోచంపల్లి రాజయ్య గొప్ప ఆదర్శమూర్తి అని కొనియాడారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు సంపత్ కుమార్ సబంతి, నవీన్ కుమార్ రమాదేవి, శ్రీవాస్తు, మౌనికతోపాటు ఆశ్రమ నిర్వాహకులు పోచంపల్లి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.