Compensation | రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, జూన్ 17: వేములవాడ పట్టణంలో రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు నష్ట పరిహారం చెక్కులు పంపిణీ చేశారు. వేములవాడ తిప్పాపూర్ బ్రిడ్జి నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు విస్తరణ చేపట్టనున్న సందర్భంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు జిల్లా సమీకృత కార్యాలయల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, వేములవాడ ఆర్డీవో రాధాబాయి చెక్కులు పంపిణీ చేశారు.
ఇప్పటిదాకా వేములవాడలోని 150 మందికి చెక్కులు అందజేసినట్లు ఆర్డీవో తెలిపారు. వేములవాడ లోని ఇంకా చాలా మంది నష్టపరిహారం చెక్కులు తీసుకునేందుకు సుముఖంగా ఉన్నారని, వారికి అందజేస్తామని ఆర్డీవో చెప్పారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.