రామగిరి, జూన్ 1: లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ను పకడ్బందీగా నిర్వహించాలని, అందు కు అవసరమైన అన్ని ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆదేశించారు. సెంటినరీకాలనీలోని జేఎన్టీయూ కళాశాల హాల్లో ఎన్నికల లెక్కింపు కోసం ఏర్పాట్లను శనివారం అదనపు కలెక్టర్ అరుణశ్రీ, శ్యామ్ ప్రసాద్‌లాల్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
కౌంటింగ్ కేంద్రం వద్ద బారికేడ్లు ఉంచాలని, ఎన్నికల ఏజెంట్లు, ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బందికి ప్రత్యేక ఎంట్రన్స్ ఉండేలా చూడాలన్నారు. అనంతరం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం చేసిన ఏర్పాట్లను కూడా పరిశీలించారు. పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని, పాసులు ఉన్నవారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రం లోపలికి అనుమతించాలని అన్నారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్ సీల్‌ను పరిశీలించారు.