Collector inspects | వెల్గటూర్, జులై 8 : వెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లి, కిషన్‌రావుపేటలో నూతనంగా నిర్మాణం చేసిన పల్లె దావఖానలను జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిగిలిపోయిన పనులను త్వరగా పూర్తిచేసి 15 రోజుల్లో ప్రారంభం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో పులి మధుసూదన్, తహసీల్దార్ ఆర్ శేఖర్, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో శ్రీనివాస్, ఎంపీడీవో జక్కుల శ్రీనివాస్, పీఆర్ ఈ ఈ లక్ష్మణరావు, డీఈ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.