Korukanti Chandar | గోదావరిఖని : మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి లేదా స్థానిక ఎమ్మెల్యే మాక్కాన్ సింగ్ సమాధానం చెప్పాలని, కానీ స్థాయిని మించి మాజీ మంత్రి హరీష్ రావుపై పరుష పదజాలంతో తమ స్థాయుని మించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం సరికాదని రామగుండం మాజీ శాసనసభ్యుడు, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కోరుకంటి చందర్ పేర్కొన్నారు. హరీష్ రావు దిష్టి బొమ్మను దహనం చేయడాన్ని కోరుకంటి చందర్ ఖండించారు. హరీష్ రావు దూషించి దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ నాయకులపై ఆయన స్థానిక నాయకులతో కలిసి గోదావరిఖని-1 టౌన్ లో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండానికి 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ కు రూ.10 వేల 880 కోట్లతో క్యాబినెట్ లో అమోదం లభించడం తెలిసిందేనని తెలిపారు. ఎన్టీపీసీ రూ.7 ఒక యూనిట్ చొప్పున ప్లాంట్ నిర్మిస్తామంటే బయట రూ.5 కే దోరుకుతుందని, ప్లాంట్ నిర్మాణానికి ఆరేళ్ల సమయం పడుతుందని అసెంబ్లీ లో సీఎం రెవంత్ రెడ్డి మాట్లాడారని తెలిపారు. రూ.10 వేల 880తో ప్లాంటు నిర్మాణం అంటే ఒక్క యూనిట్ రూ.8 పడే అవకాశం ఉందని, ఈ విషయం పై మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు దిష్టి బొమ్మను స్థానిక కాంగ్రెస్ నాయకులు దహనం చేయడం సరైంది కాదన్నారు.
హరీష్ రావు దిష్టిబొమ్మ దహనం చేసిన వారిపై కేసు నమోదు చేసి తగినచర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, పాముకుంట్ల భాస్కర్, కల్వచర్ల కృష్ణ వేణీ, బాదే అంజలి, గాధం విజయ, నాయకులు అచ్చె వేణు, మేతుకు దేవరాజ్, నూతి తిరుపతి, బోడ్డుపల్లి శ్రీనివాస్, నారాయణదాసు మారుతి, జక్కుల తిరుపతి, మేడి సదానందం, ముద్దసాని సంధ్యా రెడ్డి, తోకల రమేష్, సట్టు శ్రీనివాస్, బుర్ర శంకర్, బుర్రి వెంకటేష్, నీరటీ శ్రీనివాస్, ఇరుగురాళ్ల శ్రావణ్, చింటూ, బాలరాజు, పద్మ, రామరాజు తదితరులు పాల్గొన్నారు.