రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదినం సందర్భంగా ఆయనకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంత్రి ప్రగతిభవన్లో గురువారం ముఖ్యమంత్రిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. సహచర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రి కొప్పులకు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మంత్రి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి.
– పెద్దపల్లి, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ)