Chigurumamidi | చిగురుమామిడి, ఫిబ్రవరి 2: విద్యార్థులు, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో విజయ్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ క్రీడా ఉత్సవాలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ విద్యార్థులు, యువత చదువుతోపాటు క్రీడలలో రాణించాలని అన్నారు.
క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలని, క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమన్నారు. క్రీడలతో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ స్వరూప రాణి, మండల విద్యాధికారి పావని, ఎంపీడీవో కార్యాలయం సూపరింటెండెంట్ ఖాజామోయినోద్దిన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహామ్మద్ ఇర్షాద్, ఎస్జిఎఫ్ సెక్రటరీ సమ్మయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు సూర్య ప్రకాష్, జ్యోతి, సఫియా, రజిత, సిఆర్పి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, ఉపాధ్యాయులు క్రీడాకారులు పాల్గొన్నారు.
100శాతం ఉత్తీర్ణత సాధించాలి : విజయ్ కుమార్, ఎంపీడీవో
పదో తరగతి విద్యార్థులు పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని ఎంపీడీవో విజయ్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సోమవారం ఇన్చార్జి ఎంపీఓ ఖాజా మోహినోద్దీన్ తో కలిసి సందర్శించారు. మార్నింగ్ స్టడీ వరకు విద్యార్థులందరూ హాజరు కావాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు సొంత ఖర్చులతో సాయంత్రం స్నాక్స్ అందజేస్తున్న ప్రధానోపాధ్యాయులను ఎంపీడీవో అభినందించారు. వీరి వెంట ఎంఈఓ పావని, ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ ఇర్షాద్, సిఆర్పి ఆంజనేయులు ఉన్నారు.