Chigurumamidi | చిగురుమామిడి, జనవరి 7 : గ్రామంలో బెల్ట్ షాపులు రద్దుచేసి ప్రజల ఆరోగ్యం పై దృష్టి సారిస్తామని బీఆర్ఎస్ మండల మహిళా నాయకురాలు, సర్పంచ్ ఆకవరం భవాని అన్నారు. చిగురుమామిడి గ్రామపంచాయతీ కార్యాలయంలో వార్డు సభ్యులతో బుధవారం గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలో ప్రధాన నడిరోడ్డు పక్కనే వైన్స్ షాపు ఉండడం వల్ల వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు.
అలాగే బోగస్ పెన్షన్ల ఏరివేతతో పాటు గ్రామస్తుల కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు, పారిశుద్ధంపై దృష్టి సారిస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతీ ఇంటా మొక్కలు నాటేలా కార్యక్రమాన్ని చేపట్టనున్నామన్నారు. ఈ గ్రామ సభలో ఉపసర్పంచ్ విజయ, పంచాయతీ కార్యదర్శి రమేష్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.