TTLF | కమాన్ చౌరస్తా, మే 24 : తెలంగాణ టీచర్స్, లెక్చరర్స్ ఫోరం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమకారుడు, తెలుగు ఉపన్యాసకుడు చెన్నమల్ల చైతన్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు టీటీఎల్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మాసం రత్నాకర్ పటేల్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి రాజేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా నగరంలోని ఓ హోటల్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
రానున్న విద్యా సంవత్సరంలో ప్రైవేటు టీచర్ల లెక్చలర్లకు, యాజమాన్యాలకు నూతన జిల్లా అధ్యక్షుడు అనుసంధానంగా పనిచేయాలని, జిల్లాలోని టీచర్స్, లెక్చరర్స్ సమస్యల పరిష్కారానికి నూతన అధ్యక్షుడు చైతన్య కృషి చేస్తారని పేర్కొన్నారు. నూతన జిల్లా అధ్యక్షుడు చైతన్య తన ఎన్నిక పట్ల మాసం రత్నాకర్, వంగపల్లి రాజేశ్వర్, సముద్రాల లింగారావు, ఊట్కూరి రామచంద్ర రెడ్డి, టీటీఎల్ఎఫ్ కుటుంబ సభ్యులకు ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు నీర్ల సతీష్, కుందేటి సత్యనారాయణ, బోడ కుంటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.