కథలాపూర్, నవంబర్ 8: ‘ఎంతోమంది అమరుల త్యాగాలతో.. ఏండ్ల పాటు కొట్లాడి సాధించుకున్న తెలంగాణను దొంగల చేతిలో పెట్టవద్దు. వ్యవసాయానికి కాంగ్రెస్ మూడు గంటల కరెంట్ సరిపోతుందని అంటున్నది. సరిపోతదా..? పొలం పారుతదా..? రైతులు ఆలోచించాలి. నేనొక్కటే అడుగుతున్నా.. సాగుకు పుష్కలంగా నీళ్లు ఇచ్చి, 24 గంటల కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్ కావా లా.. మూడు గంటలిచ్చి గోసపెట్టే కాంగ్రెస్ కావా లా..? మీరే ఆలోచించుకోవాలి’ అని వేములవాడ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు ప్రజలకు పిలుపునిచ్చారు.
‘గడప గడపకూ గులాబీ జెండా’ కార్యక్రమంలో బుధవారం కథలాపూర్ మండ లం గంభీర్పూర్, బొమ్మెన, దూలూర్, దుంపేట గ్రామాల్లో మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో చల్మెడకు మహిళలు బతుకమ్మలతో, గంగపుత్రులు వలలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చల్మెడ మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి సాధించుకున్న రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తున్నదని, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని కొనియాడారు. అన్నింటా అభివృద్ధి చెందిన తెలంగాణను దొంగల చేతిలో పెట్టి మోసపోవద్దని సూచించారు.
ప్రభుత్వ సంక్షేమ ఫలాలు సక్రమంగా అందాలన్నా..? రాష్ట్రం మరింత అభివృద్ధి చెంది పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపాలన్నా మళ్లీ కారు గుర్తుకు ఓటేసి సీఎం కేసీఆర్‌ను మూడో సారి సీఎంను చేయాలని కోరారు. సేవ చేయాలనే ఆశయంతో ముందుకు వస్తున్న తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరారు. మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఇప్పటి వరకు అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ఇంకా మరింత అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా చల్మెడ లక్ష్మీనర్సింహారావును గెలిపించాలని కోరారు.
తమ గ్రామంలో ప్రచారానికి వచ్చిన వేములవాడ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావుపై దూలూర్ గ్రామ మహిళలు అభిమానం చూపారు. ఎన్నికల నామినేషన్ ఖర్చుల కోసం రూ.10 వేలు అందించారు. అనంతరం భారీ మోజార్టీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చా రు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ జవ్వాజి రేవతి, జడ్పీటీసీ నాగం భూమయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గడీల గంగప్రసాద్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు బొడ్డు బాలు, సర్పంచులు, ఎంపీటీసీలు పోతు సింధూజ, రాజశేఖర్, పిడులు లావణ్య,
తిరుపతిరెడ్డి, అంబటి లత, పురుషోత్తం, మల్యాల రమేశ్, ఏఎంసీ చైర్మన్ గుండారపు సౌజన్య, గంగాధర్, కోఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, వైస్ ఎంపీపీ గండ్ర కిరణ్‌రావు, సింగిల్‌విండో చైర్మన్ దాసరి గంగాధర్, వైస్ చైర్మన్ శీలం మోహన్‌రెడ్డి, నాయకులు వర్ధినేని నాగేశ్వర్రావు, సోమ దేవేందర్‌రెడ్డి, కల్లెడ శంకర్, గడ్డం భూమారెడ్డి, మామిడిపెల్లి రవి, ఏజీబీ మహేందర్, కేతిరెడ్డి మహిపాల్‌రెడ్డి, చెక్కపెల్లి రాజ్‌కుమార్, రొక్కం హరీశ్‌రెడ్డి, చీటి విద్యాసాగర్‌రావు, మిర్యాల వెంకటేశ్వర్రావు, నల్ల గంగాధర్, రమేశ్, స్వామి, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్, కిషన్‌రెడ్డి, వేణుగోపాల్, శ్రీహరి, రాకేశ్ ఉన్నారు.