రామడుగు, ఏప్రిల్ 25: వడగండ్ల వానతో పంటలు దెబ్బతిన్న రైతులు అధైర్యపడొద్దని, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రామడుగు మండలం షానగర్‌లో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను మంగళవారం ఆయన పరిశీలించారు. బాధిత రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా వీర్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకుంటారన్నారు. కాగా, వన్నారంలో దెబ్బతిన్న పంటలను ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్ జూపాక కరుణాకర్ పరిశీలించారు.
వెదిర, తదితర గ్రామాల్లో వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. కొక్కెరకుంట సింగిల్ విండో చైర్మన్ వొంటెల మురళీకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి, మండల ఇన్చార్జి వ్యవసాయాధికారి సంజీవరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కలిగేటి లక్ష్మణ్, సైండ్ల కరుణాకర్, చిరుత అంజయ్య, రాంచంద్రం, మినుకుల తిరుపతి, జూపాక మునీందర్, వెదిర వీడీసీ చైర్మన్ నాగుల రాజశేఖర్‌గౌడ్, ఎంపీటీసీ తొరికొండ అనిల్‌కుమార్, ఉప సర్పంచ్ ఎడవెల్లి సత్యనారాయణరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ శనిగరపు అనిల్‌కుమార్, నాయకుడు అర్జున్, ఏఈవో సంపత్ పాల్గొన్నారు.